23, ఆగస్టు 2020, ఆదివారం

వెలుగురేకై పల్లవిస్తాను

**********************************
పేరు: శ్రీదాస్యం లక్ష్మయ్య
కవితసంఖ్య: 508
అంశం: వెలుగురేకై పల్లవిస్తాను
శీర్షిక: అంకురం కోసం
**********************************
మూసుకున్న తలుపుల వెనుక
దోసిళ్ళ కొద్దీ దుఃఖాలుంటాయి
యెతలగీతాలు మూగబోవాలని
రెక్కలొచ్చి ఎగిరిపోయిన గూటిలో
దిగులు మేఘాలు దిక్కులు చూస్తుంటై
వాలినరెక్కలతో వాలేపొద్దుకోసం
వలసపక్షుల బాటల వెంట
తరుముకొచ్చే తనఖాలుంటాయి
బతుకు బాకీలమోత దూరమవ్వాలని
బురదపొలం ఇరువాళ్ళల్లో
తడిఆరని రెక్కల దృశ్యాలుంటయి
నేలనేలంతా తడిపే దేవులాటల శ్వాస
ముదిమి ముంగిట వాలిన జంటకు
వెతుకులాటల పితలాటకం
అడుగడుగునా ఆసరాకై ఆశ..
కాలానికి ఎదురీదే కాయాల ఎదురుచూపు
గాయాల సలపరింతల కైగొట్టి
వెలుగురేకై పల్లవించే ఆశాకిరణాలకోసం
సంకటాలను బాపే అంకురం కోసం
**********************************
పేరు: శ్రీదాస్యం లక్ష్మయ్య
ఊరు: హుస్నాబాద్
**********************************

నామరూపాలు

నేటికవిత తేది: 19-08-2020
**********************************
పేరు: శ్రీదాస్యం లక్ష్మయ్య
కవితసంఖ్య: 511
అంశం: నామరూపాలు
శీర్షిక: నశ్వరాలే
**********************************
వేవేల నామాలు, రూపాలూ
ఒక్కరివేనని తెలిసినా
దిక్కుతోచని ఆరాటం
జన్మరాహిత్యం వైపైనా
అడుగులు పడని దైన్యం
కాళ్ళు నేలపైనే ఆనినా
ఎనలేని పేరు ప్రతిష్టలకోసం
అశాశ్వతమైన రూపం పై
అవ్యాజమైన అనురాగంతో
అనునిత్యం కాలయాపన
జవసత్వాల సత్తువ తెలిసినా
జగమే మాయనే భ్రమలో తేలినా
దేనికోసమో వెతుకులాట
పాకుడురాళ్ళపై పాకులాట
స్వర్గానికి నిచ్చెనలంటూ
సర్వస్వం కాలరాసుకుని
ఉట్టివరకే అందుకోగలిగే
వర్ధమాన విరాజితుల త్రోవ
ఉత్తర దక్షిణాయనాల మధ్య
ఊగిసలాటలోనే పుణ్యకాలం గడిపి
నామరూపాల నాదస్వరమూదేలోపే
బతుకుజీవుడా అంటున్న అభాగ్యులు
**********************************
పేరు: శ్రీదాస్యం లక్ష్మయ్య
హుస్నాబాద్, జి. సిద్ధిపేట
**********************************

ఆనందవర్ణాలు

నేటికవిత తేది: 20-08-2020
**********************************
పేరు: శ్రీదాస్యం లక్ష్మయ్య
కవితసంఖ్య: 512
అంశం: ఆనందవర్ణాలు
శీర్షిక: సంతృప్తే సప్తవర్ణశోభితం
**********************************
ఆనందం ఆర్ణవమైతే
చెలియలికట్టల చింతేలేదు
మనసే ఒక నందనమైతే
ఉదయించని వెలుగేలేదు
కలవరాల పరదాతీసి
శషబిషలను చాపచుట్టితే
మధురోహల మాధుర్యంలో
మనసంతా మనోహరమే
వాసంతపు సీమంతంలో
సరాగాల జీవన రాగాలాపన
తొలకరిలో మొలకల జావళి
ప్రకృతికాంత వింజామరలు
తలపుల తాదాత్మ్యాలకు
శివాలెత్తు శింజానం
అలవికాని ఆనందాలతో
హృదయంగత నిక్వాణం
సంతృప్తే సప్తవర్ణశోభితం
ఆనందవర్ణాల ఆస్వాదనం
హుషారెత్తు ఎదముంగిట్లో
సంతసాల సంరంభాలు
పరవశాల సుమగంధాలు
**********************************
పేరు: శ్రీదాస్యం లక్ష్మయ్య
హుస్నాబాద్, జి. సిద్ధిపేట
**********************************

22, ఆగస్టు 2020, శనివారం

6, మార్చి 2017, సోమవారం


ముదిమి  (కవిత్వం)
సంపాదకత్వం   శ్రీదాస్యం  లక్ష్మయ్య           నవంబర్  2016

మనసా   ( శతకం )  డిసెంబర్  2016
రచన ; శ్రీదాస్యం  లక్ష్మయ్య 

27, అక్టోబర్ 2013, ఆదివారం

నా ప్రపంచంలోకి సుస్వాగతం: Bijugir (VIJAYAGIRI) Sri Lakshmi Narasimha Swamy


నా ప్రపంచంలోకి సుస్వాగతం: 

bijugir (Vijayagiri) Lakshmi Narasimha Swamy

కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండల కేంద్రానికి  పది కిలోమీటర్ల దూరంలో బిజిగిరి షరీఫ్ అనే గ్రామం  ఉంటుంది . ఈ గ్రామంలో గల కొండ పైన వెలసిన క్షేత్రమే బిజుగీరు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి పుణ్య ధామం. భక్త జనకోటి కోరిన కోర్కెలను నెరవేర్చే దైవంగా , ఇలవేల్పుగా యిడుములు బాపే శ్రీహరిగా ఇలలో మూడు కొండలస్వమిగా వినుతి కెక్కిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కొండ అసాంతము మహిమలతో నిన్దినదేనని  భావము

9, మార్చి 2011, బుధవారం

udayasaahithi

ఉదయ సాహితి 

(సాహిత్య వికాస వేదిక)
హుస్నాబాద్, కరీంనగర్ జిల్లా, ఆంధ్ర ప్రదేశ్  505467

publishind the books with the mutual financial cooperative system.

ఉదయసాహితి పరస్పర ఆర్థిక సహకార పద్దతిలో ప్రచురించిన పుస్తకాలు :

1. బ్యాలెట్ ...బ్యాలెట్ ...... (కవిత్వం) (2004)

2. బాల్యం   (కవిత్వం)   (2004)

3. అమ్మంటే .....(కవిత్వం)  (2004)

4.  బ్రతుకమ్మా ... బ్రతుకు   (కవిత్వం)  (2005)

5. ఉదయ కిరణాలు  (కవిత్వం)  (2005)

6. తెలుగు వెలుగు (పద్య సంపుటి)   (2005)

7. ఆకాశంలో సగం  (కవిత్వం)  (2005)

8. చెలిమి  (కవిత్వం) (2006)

9. వసంత రాగాలు   (కవిత్వం) (2006)

10. గురువు  (కవిత్వం)  (2010)

11. సహచరి   (కవిత్వం)  (2013)

5. నిజం  ( వచన కవితా శతకం)