**********************************
పేరు: శ్రీదాస్యం లక్ష్మయ్య
కవితసంఖ్య: 508
అంశం: వెలుగురేకై పల్లవిస్తాను
శీర్షిక: అంకురం కోసం
**********************************
మూసుకున్న తలుపుల వెనుక
దోసిళ్ళ కొద్దీ దుఃఖాలుంటాయి
యెతలగీతాలు మూగబోవాలని
రెక్కలొచ్చి ఎగిరిపోయిన గూటిలో
దిగులు మేఘాలు దిక్కులు చూస్తుంటై
వాలినరెక్కలతో వాలేపొద్దుకోసం
వలసపక్షుల బాటల వెంట
తరుముకొచ్చే తనఖాలుంటాయి
బతుకు బాకీలమోత దూరమవ్వాలని
బురదపొలం ఇరువాళ్ళల్లో
తడిఆరని రెక్కల దృశ్యాలుంటయి
నేలనేలంతా తడిపే దేవులాటల శ్వాస
ముదిమి ముంగిట వాలిన జంటకు
వెతుకులాటల పితలాటకం
అడుగడుగునా ఆసరాకై ఆశ..
కాలానికి ఎదురీదే కాయాల ఎదురుచూపు
గాయాల సలపరింతల కైగొట్టి
వెలుగురేకై పల్లవించే ఆశాకిరణాలకోసం
సంకటాలను బాపే అంకురం కోసం
**********************************
పేరు: శ్రీదాస్యం లక్ష్మయ్య
ఊరు: హుస్నాబాద్
**********************************