23, ఆగస్టు 2020, ఆదివారం

నామరూపాలు

నేటికవిత తేది: 19-08-2020
**********************************
పేరు: శ్రీదాస్యం లక్ష్మయ్య
కవితసంఖ్య: 511
అంశం: నామరూపాలు
శీర్షిక: నశ్వరాలే
**********************************
వేవేల నామాలు, రూపాలూ
ఒక్కరివేనని తెలిసినా
దిక్కుతోచని ఆరాటం
జన్మరాహిత్యం వైపైనా
అడుగులు పడని దైన్యం
కాళ్ళు నేలపైనే ఆనినా
ఎనలేని పేరు ప్రతిష్టలకోసం
అశాశ్వతమైన రూపం పై
అవ్యాజమైన అనురాగంతో
అనునిత్యం కాలయాపన
జవసత్వాల సత్తువ తెలిసినా
జగమే మాయనే భ్రమలో తేలినా
దేనికోసమో వెతుకులాట
పాకుడురాళ్ళపై పాకులాట
స్వర్గానికి నిచ్చెనలంటూ
సర్వస్వం కాలరాసుకుని
ఉట్టివరకే అందుకోగలిగే
వర్ధమాన విరాజితుల త్రోవ
ఉత్తర దక్షిణాయనాల మధ్య
ఊగిసలాటలోనే పుణ్యకాలం గడిపి
నామరూపాల నాదస్వరమూదేలోపే
బతుకుజీవుడా అంటున్న అభాగ్యులు
**********************************
పేరు: శ్రీదాస్యం లక్ష్మయ్య
హుస్నాబాద్, జి. సిద్ధిపేట
**********************************

కామెంట్‌లు లేవు: